జీనెక్స్ మిర్చి విత్తనాలతో అధిక దిగుబడులు సాధ్యం.. కంపెనీ ఏఎస్ఎం మల్లికార్జునరావు..

Published: Thursday January 12, 2023
తల్లాడ, జనవరి 11 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో బుధవారం జేనెక్స్ కీర్తి - 22 హైబ్రిడ్ మిరప రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సు జెనెక్స్ కంపెనీ ఏఎస్ ఎం మల్లికార్జునరావు హాజరై మాట్లాడుతూ ఈ విత్తనాలు వాడటం వల్ల కాయ సైజులో ఉండి కింది నుండి పై వరకు కాపు వస్తుందన్నారు. అదేవిధంగా మార్కెట్లో అధిక ధర పలుకుతుందన్నారు. కాయలో విత్తనాలు ఎక్కువగా ఉండి తూకం అధికంగా వస్తుందన్నారు. తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం ఉండి  లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు.  రైతులందరూ ఈ విత్తనాలను సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది రవీంద్ర, వీరారెడ్డి, సతీష్, డిస్ట్రిబ్యూటర్ పగడాల శ్రీనివాసరావు, రైతులు  పాల్గొన్నారు.