సిర్లహిల్స్ కాలనీలో గణనాథుని లడ్డు 67,000 కైవసం చేసుకున్నారు

Published: Wednesday September 22, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : హిందూసంప్రదాయాలను కనుమరుగవుతున్న సందర్భంలో వినాయక చవితి వల్ల హిందువులందరూ మేల్ కొంటున్నారని స్థానిక కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి పేర్కొన్నారు. మీర్ పేట్  కార్పొరేషన్ 27 డివిజన్లో సిర్ల హిల్స్ లో బాల గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కమిటీ హాల్ లో ఏర్పాటుచేసిన గణేషు లడ్డూ వేలం పాట 67.000  వేల రూపాయలకు కైవసం చేసుకున్న ఎర్రగడ్డ రమేష్ కృష్ణవేణి దంపతులు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి చేతుల మీదుగా వారికి లడ్డును అందజేశారు. స్థానిక కార్పోరేటర్ మాట్లాడుతూ..... హిందూ సాంప్రదాయలను కనుమరుగవుతున్న సందర్భంలో ఈ వినాయక చవితి వల్ల హిందువులందరూ మేల్కొని ఎంతో ఘనంగా గణనాథుని పవిత్రంగా నవరాత్రులు పూజలు నిర్వహించారు. బాల గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు వారికి సహకరించిన కాలనీవాసులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. లడ్డు కైవసం చేసుకున్న దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.. భారత్ మాతాకీ జై. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మహిళామణులు, ప్రజలు తదితరులు  పాల్గొన్నారు.