మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి

Published: Friday August 05, 2022
యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 4 ఆగస్టు ప్రజా పాలన : మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ వీడియోలు ఫోటోలను మార్పింగ్ చేసి అసత్య ఆరోపణలతో దుష్ప్రచారాన్ని మానుకోవాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి అశోక్ ముదిరాజ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు కొంత మంది ప్రసాద్ కుమార్ పై బురద చల్లే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వీడియోలను ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవివేకం అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారం గురించే చర్చిస్తామని పేర్కొన్నారు. రాజకీయ ప్రతిపక్ష నాయకులను కించపరిచే విధంగా వ్యవహరించమని విశ్వాసం వ్యక్తం చేశారు. మాకు కూడా వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి మీకంటే ఎక్కువ ట్రోల్స్ చేయగలమని హెచ్చరించారు. అధికారంలో ఉండి అభివృద్ధి చేయడం చేతకాక పోగా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద ప్రజలను , రైతులను మోసం చేస్తున్నారు. ఆనంతగిరిని తెలంగాణ ఊటీ చేస్తామని, పాలమూరు ఎత్తిపోతల పధకం వికారాబాద్ కు తెస్తామని,  దోర్నాల బ్రిడ్జి ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారన్నారు. కోటపల్లి బ్రిడ్జి కి 50 లక్షల రూపాయలు గంగలో వేశారు. ఇలా ఎన్నేన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చక పోగా మాజీమంత్రి ప్రసాద్ కుమార్ గారిపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే బాగుండదని ఘాటుగా స్పందించారు.