చెరకు టన్ను రూ.3,150 మద్దతు ధర. సంక్రాంతి తరువాత మరో రూ.50 అదనంగా చెల్లింపు. విలేకర్ల సమావేశంలో వెల

Published: Tuesday November 15, 2022
చెరకు టన్ను రూ.3,150 మద్దతు ధర.
 
సంక్రాంతి తరువాత మరో రూ.50 అదనంగా చెల్లింపు.
 
విలేకర్ల సమావేశంలో వెల్లడించిన ఫ్యాక్టరీ యండీ కృష్ణయ్య..
 
 
పాలేరు నవంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ చెరకు సరఫరా చేసే రైతులకు టన్నుకు మద్దతు ధర రూ.3.150 చెల్లించనున్నట్లు మధుకాన్ షుగర్ అండ్ వపర్ ఇండస్ట్రీస్ యం.డీ. నామా కృష్ణయ్య ప్రకటించారు. ఫ్యాక్టరీలో సోమవారం తొలుత రైతు కోర్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశంను నిర్వహించారు. చర్చలు అనంతరం ధర పట్ల కమిటీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ప్రతినిధులతో కలిసి యం.డి తన చాంబర్లో విలేకర్ల సమావేశం ను నిర్వహించారు. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నప్పటీకీ రైతుల సంక్షేమం కోసం యాజమాన్యం పాటుపడుతుందని పేర్కొన్నారు. 20 ఏళ్ల ను పూర్తి చేసుకుని 21 క్రషింగ్ చేసుకోబోతున్నట్లు -తెలిపారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీ కి దాదాపు రూ.200 కోట్ల అదనపు భారం భరించినట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ,
 
భారం భరించినట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాల కోసం యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే ధర రూ.3020 కు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.130 కలిపి ఈ సీజన్ లో టన్ను కు రూ.3,150 రైతులకు చెల్లించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సంక్రాంతి తరువాత టన్నుకు రూ.50 అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. యాజమాన్యం - రైతులు సమిష్టిగా చెరకు సాగు ఖర్చులు తగ్గించికుంటూ, నాణ్యమైన చెరకు ను దిగుబడి పెంచుకోవాలని
 
సూచించారు. పంచదార రికవరి పెంచుకుంటేనే ధర పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు పరిశ్రమను కాపాడుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మద్దతు ధర పట్ల రైతు కమిటి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో చెరకు అభివృద్ధి మండలి చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, డైరెక్టర్ వీరవెల్లి నాగరాజు, జనరల్ మేనేజర్ కోటయ్య, కోర్ కమిటీ సభ్యులు రచ్చా నరసింహారావు, వజ్జా శ్రీనివాసరావు, తాళ్లూరి రవి, మంకెన
వెంకటేశ్వరరావు. చింతనిప్పు సైదులు, విష్ణువర్ధన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.