హాస్టల్ లో ఉండే విద్యార్థులకు బస్సు పాస్ లు ఇవ్వాలి: ఎస్ఎఫ్ఐ

Published: Tuesday November 16, 2021
మంచిర్యాల బ్యూరో, నవంబర్15, ప్రజాపాలన : హాస్టల్ లో ఉండే విద్యార్థులకు ఉచితం గా  బస్సు పాస్ లు ఇవ్వాలని  ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల డిపో ముందు నీరసన చేపట్టారు. అనంతరం డిపో మేనేజర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోళ్ళావాగు నుండి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల వరకు మినీ బస్సు నడపాలని కోరారు. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని సున్నాంబట్టి ప్రభుత్వ ఇంటిగ్రెటెడ్ బాలుర హాస్టల్ లో ఉన్న విద్యార్థులు, బాయ్స్ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్నారని, ఈ విద్యార్థులు ప్రతి రోజు ఆర్టీసీ బస్సు లో పాఠశాలకు వెళ్తుంటారని పేర్కొన్నారు. ఈ విద్యార్థులకు ప్రతి నెల బస్సు పాస్ లకు ఒక్కరికి 145/- రూపాయలు ఖర్చు అయితున్నాయని. హాస్టల్లో ఉన్నది అందరు పేద విద్యార్థులే కాబట్టి ఉచితంగా బస్సు పాస్లు ఇవ్వాలని కోరారు. అదే విదంగా గ్రామాల నుండి చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లో ఉంటు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులు 4 కిలోమీటర్లు నడుస్తూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అరుణ్, నవీన్, ప్రవీణ్, కుమార్, అఖిలేష్, వరుణ్, హర్ష వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.