మెడికల్ కళాశాలను బెల్లంపల్లి లోనే ఏర్పాటు చేయాలి : కొయ్యల ఏమాజీ

Published: Monday May 24, 2021

బెల్లంపల్లి, మే 23, ప్రజా పాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను బెల్లంపెల్లి లోనే ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గం బిజెపి ఇంచార్జి కోయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1998 లోనే అప్పటి ప్రభుత్వం మెడికల్ కళాశాలకు అనుమతించి 50 శాతం భవన నిర్మాణ పనులు పూర్తి కాగా స్థానిక నాయకుల సమన్వయ లోపం వల్ల ఆగిపోయిన మెడికల్ కళాశాలను అదే స్థానంలో తిరిగి నిర్మించాలని ఆయన అన్నారు. మెడికల్ కళాశాలకు కావలసిన రెండు వందల ఎకరాల భూమితోపాటు జాతీయ రహదారి, రైల్వే రవాణా సౌకర్యం, అన్ని అందుబాటులో ఉండి కొమురంభీం జిల్లాకు మంచిర్యాల జిల్లాకు గోదావరిఖని వరకు అన్ని వర్గాల ప్రజలకు కేంద్రబిందువుగా బెల్లంపల్లి ఉంటుంది కావున బెల్లంపల్లిలో నే ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దుర్గం చిన్నయ్య  నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గానికి దోహదపడే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పించి బెల్లంపెల్లి లోనే కళాశాల ఏర్పాటు అయ్యేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో ఏ మాజీ తో పాటు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, రాచర్ల సంతోష్, బిజెపి కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిత రాజు లాల్, తదితరులు పాల్గొన్నారు.