ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ -19 వ్యాక్ష్సినేషన్

Published: Wednesday March 31, 2021

వలిగొండ, మార్చి 30, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వలిగొండ నందు డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ సుమలత, డాక్టర్ కిరణ్, డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రతి సోమ, మంగళ, గురు, శుక్రవారం రోజులలో 45 సంవత్సరాలు నిండిన వయసు నుంచి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రజలందరూ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఈరోజు మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య, మరియు వారి అన్నగారు తుమ్మల సుదర్శన్ 99 సంవత్సరముల వయస్సు గల వారు కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నవారు. ఈరోజు 55 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది.మరల రెండవ రోజు 28 రోజులకు వ్యాక్సినేషన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా మాస్కు తప్పనిసరిగా ధరిస్తూ  చేతులను సబ్బుతో శుభ్రం గా కడుగు కోవాలి,భౌతిక దూరం పాటించాలని సూచించారు.అలాగే జనం రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదని,కరోనా జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను జయించుటకు అందరూ  ప్రభుత్వం సూచించిన టువంటి విధి విధానాలు తప్పకుండా పాటించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ ఆర్ఏపిఎంఓ, సూపర్వైజర్ సువర్ణ కుమారి, అనురాధ హెల్త్ అసిస్టెంట్, శ్రీలక్ష్మి, స్వరూప, ఫార్మసీస్ట్ శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ లలిత, ల్యాబ్ టెక్నీషియన్ ప్రీతంబాబు, ఆశా కార్యకర్తలు గీత, సత్యవతి, అచ్చమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.