క్యాన్సర్ వ్యాదిపై అవగాహన సదస్సు మధిర

Published: Wednesday February 15, 2023

రూరల్ ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. పృద్వి మరియు పారా మెడికల్ బృందం సoయుక్తంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న పలు ఆరోగ్య పధకాలతో పాటు వివిధ దీర్ఘకాలిక అనారోగ్యం నకు సంభందించిన జబ్బుల గురించి కాన్సర్ బీపీ షుగర్ గురించి సంపూర్ణముగా వివరించారు. ఈ కార్యక్రమంమధిర 2 బస్తి దవఖానా పరిధి లో ఎస్సి కాలనీ వాటర్ ట్యాంక్ పార్క్ పరిధిలో హెల్త్ మేళాలో భాగంగా ఉచిత ఆరోగ్య శిభిరం ఏర్పాటు చేసి క్యాన్సర్ వ్యాదిపై సంపూర్ణoగా అవగాహన పరిచి నారు. అదే విధంగా మధిర 1 సబ్ సెంటర్ పరిధిలో బాలికల హైస్కూల్ నందు విధ్యార్థిని విధ్యార్థులకు సర్వయికల్ క్యాన్సర్ గురించి పాస్ట్ ఫుడ్ లు తినకూడదు అని సంపూర్ణ ముగా వివరించారు.అదే విధంగా మడుపల్లి మహాదేవపురం దెందుకూరు ఖమ్మంపాడు సబ్ సెంటర్ లో స్కూల్ లో మరియు కాలనీ లో పలు చోట్ల హెల్త్ అవేర్ నెస్ కార్యక్రమంలు నిర్వహించి నారు. అదే విధంగా యోగ  నేర్పించుటం, సైకిల్ తొక్కటం పలు ఎక్సర్ సైజ్ లు గురించి వివరించారు ఈ కార్యక్రమం లో డా. పృథ్వి తోపాటు పిహెచ్ఎన్ గోలి రమాదేవి హెచ్ఎస్ సుబ్బలక్ష్మి హెచ్ఎస్ లంకా కొండయ్య మడుపల్లి బస్తి దవఖాన స్టాఫ్ నర్స్ భార్గవి. మహాదేవపురం పల్లె దవఖాన స్టాఫ్ నర్సు ఐశ్వర్య వివధ సెంటర్స్ ఎఎన్ఎమ్ లు జయమ్మ లీలా విజయలక్ష్మి విజయ రాజేశ్వరి అరుణ సునీలారాణి హెల్త్ అసిస్టెంట్ లు జి శ్రీనివాస్ నాగేశ్వరావు తో పాటు ఆయా పాఠశాల హెచ్ఎమ్ మరియు సిబ్బంది ఆశ ఐకేపీ అంగన్వాడీ లు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.