ప్లాస్టిక్ కవర్ల పై అవగాహన

Published: Tuesday March 08, 2022

రాయికల్, మార్చి 07 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పురపాలక సంఘం కార్యాలయము నందు మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్ రాయికల్ పట్టణ వర్తక సంఘం ప్రతినిధులతో ప్లాస్టిక్ కవర్ల వాడకం, వాటి నిషేధంపై చర్చ జరిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటి, వర్తకసంఘ ప్రతినిధులుకూరగాయల ప్రభాకర్, ఎనగందుల సత్యనారాయణ తదితర వ్యాపారులు పాల్గొన్నారు