సంక్షోభంలోను అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం - ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్

Published: Saturday April 24, 2021
జగిత్యాల, ఏప్రిల్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని 45 వ వార్డులో పలు అభివృద్ధి పనులైన సిసి రోడ్డు డ్రైనేజీ పనులకు స్థానిక ఎమ్మెల్యే డా. సంజాయ్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ క‌రోనా మ‌హ‌మ్మారితో దేశ‌వ్యాప్తంగా సంక్షోభం ఉన్న అభివృద్ధి ఆగ‌కూడద‌న్న ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ ప‌ట్ట‌ణాలు ప‌ల్లెలు తేడ లేకుండ నిధులిస్తూ సంక్షేమానికి అత్యంత ప్రాధ్యాన్య‌త ఇస్తున్నారని అన్నారు. గత ఏడాది ఇత‌ర రాష్ట్రాల నుండి వ‌ల‌స కూలీలు జిల్లాలో ఉండ‌గా వారిని సైతం ఆదుకుని మాన‌వ‌త్వం చాటుకున్న‌మ‌ని తెలిపారు. ఇక ఏడాదిగా ప్రైవేటు టీచ‌ర్ల ప‌రిస్దితి అగ‌మ్య గోచ‌రంగా తయారు కావడంతో వారికి సైతం 2 వేల రూపాయ‌ల న‌గ‌దు సాయంతో పాటు 25 కిలోల స‌న్న‌బియ్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు .క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త వ‌హించాల‌ని విధిగా మాస్క్ ధ‌రించాల‌ని కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్దితుల్లో వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని ఆస్ప‌త్రుల్లో బెడ్స్ ప్రాణ‌వాయువు ల‌భించ‌ని ప‌రిస్దితి నెల‌కొన్నందున వ్య‌క్తిగ‌త జాగ్ర‌త్త వ‌హించ‌ట‌మే శ్రీరామ‌రక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ స్తానిక కౌన్సిలర్ బొడ్ల జగదీష్ కౌన్సిలర్లు గుగ్గిళ్ళ హరీష్ కప్పల శ్రీకాంత్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్ రవి వంశీ నవీన్ భరత్ తదితరులు పాల్గొన్నారు.