ఉపాధి పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

Published: Friday April 30, 2021

అధికారి(డి ఆర్ డీ వో ) మెరుగు విద్యా చందన

పాలేరు, ఏప్రిల్ 29, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనయ్య గూడెం గ్రామంలో ఉపాధి పనులను  ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి పంచాయతీలో రోజుకి 100 మంది కూలీలు రావాలి. జిల్లాలో ఇప్పటి వరకు 1.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాo. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మెరుగు విద్య చందన దాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని నిర్వాహకులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి(డి ఆర్ డీ వో ) మెరుగు విద్యా చందన ఆదేశించారు. మండల పరిధిలోని నేలకొండపల్లి, కోనాయిగూడెం ఆరెగూడెం, అనాసాగరం గ్రామాలను గురువారం దాన్యం కొనుగోలు కేంద్రాలను, వన నర్సరీలను పరిశీలించారు.నర్సరీలో మొక్కల పెంపకం సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కంటాల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 71 దాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 58 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలియజేశారు. ఇప్పటివరకు 1.50 లక్షల క్వింటళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. ప్రతి పంచాయతీ కి రోజుకు వంద మంది కూలీలు వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. పని అడిగిన ప్రతి ఒక్కరికీ పనికి కల్పించే విధంగా గ్రామస్థాయిలో పనులు గుర్తించి సిద్ధంగా ఉంచినట్టు తెలియజేశారు. వాటర్ ఐదు రూపాయలు, గడ్డపార కు 10 రూపాయలు, ఐదు రూపాయలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వేసవి కాలం అలవెన్స్ 30 శాతం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉపాధి కూలీ 240 నలభై రూపాయల వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనాయిగూడెం సర్పంచ్ పెంటమళ్ల  పుల్లమ్మ, ఈజీఎస్ ఏపీవో సునీత, ఈ సీ శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.