స్వాతంత్ర భారతంలో ఆత్మనిర్భర్ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ ఒక గొప్ప మలుపు : బీజేపీ యువనేత బీపీ నాయ

Published: Thursday February 03, 2022
బోనకల్, ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి:ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన ఆత్మనిర్భర్ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ 2022 సమావేశంలో పాల్గొన్న బీజేపీ యువనేత ఎన్నారై బీపీ నాయక్ అన్నారు. అనంతరం బీపీ నాయక్ మాట్లాడుతూ భారతదేశం ఈ శతాబ్దంలోనే అత్యంత మహమ్మారితో పోరాటం చేస్తుందని, కరోనా తర్వాత ప్రపంచ స్వరూపం మారబోతుందని అందుకు తగ్గట్లుగానే ప్రపంచంలో భారతదేశం ఆర్థిక పరిపుష్టిత 2లక్షల 30 వేల కోట్ల రూపాయలతో సాధించాలనే కోణంలో ఈ బడ్జెట్ ను తయారు చేశారని, ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థలో ఒక్క ముఖ్యమైన మలుపు లాంటిదని, భారత్ వివిధ రంగాలలో స్వావలంబన సాధించాలని దేశంలో ఉన్న నిరుపేదలు, పేదలు మరియు మధ్యతరగతి వారికి, నిరుద్యోగులకు, యువతకు చేయూత నిచ్చే విధంగా బడ్జెట్ ను తయారు చేశారని, ఎన్నో గుణాత్మక మార్పుల ద్వారా భారత వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదపడేలా, రైతులకు ఎన్నో విధాలుగా మేలు చేసేలా చర్యలు తీసుకున్నారని, 80 లక్షల కుటుంబాలకు పక్కా నివాస గృహాలు నిర్మించేలా 9 కోట్ల కుటుంబాలకు నీటి కొళాయి కనెక్షన్ ఇచ్చే విధంగా, 4 కోట్ల కుటుంబాలకు త్రాగునీటి సరఫరా అయ్యే విధంగా ప్రణాళికలు రచించారని, సరిహద్దు గ్రామాలను వైబ్రాంట్ విలేజస్ గా మార్చి యువతలో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు, ఆ గ్రామాలను పర్యాటక ప్రాంతంగా మార్చే ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు. దేశంలోనే మొదటిసారిగా నేషనల్ ఫార్మింగ్ కారిడార్ ప్రారంభించి ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, రైతులకు సోలార్ పంపులు, విత్తన సబ్సిడీలు, మద్దతు ధర పెంచే విధంగా చర్యలు తీసుకున్నారని నరేంద్ర మోడీ ద్వారా బీపీ నాయక్ వివరించారు.