నిరుపేద కుటుంబ - ఆడపిల్లల పెళ్లికి ఆర్ధిక సహాయం అందజేసిన రాం బ్రదర్స్.

Published: Saturday May 21, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 20 ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  మంచాల మండలములోని ఎల్లమ్మతండా గ్రామములో శుక్రవారం రోజు  రాంబ్రదర్స్ ఫౌండేషన్  ద్వారా అమ్మాయి పెళ్లి కనుకగా  నవ సమాజ్ నిర్మాణ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు & రాంబ్రదర్స్ ఫౌండేషన్ ఫౌండర్ - దేవరాం నాయక్  సపావట్  ఆర్ధిక సహాయంగా ₹5000/- చెక్కును మంగమ్మ మోతీలాల్ దంపతులకు అందజేశారు. ఈ సందర్బంగా దేవరాం నాయక్ మాట్లాడుతూ  రాంబ్రదర్స్ ఫౌండేషన్' ద్వారా గ్రామములోని ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని, గ్రామములో  ప్రతి పేదింటి ఆడపిల్లల పెండ్లికి భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ఈ  ఆర్ధిక సహాయాన్ని రాంబ్రదర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గన్య నాయక్, బాల్ దాస్ నాయక్,రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. *_@రాంబ్రదర్స్_*