ఆలంపల్లి బోనమ్మ గుడి దగ్గర నాటిన జమ్మి మొక్కలు

Published: Tuesday October 05, 2021
వికారాబాద్ బ్యూరో 04 అక్టోబర్ ప్రజాపాలన : దసరా ఉత్సవాలలో ప్రధాన భూమిక పోషించే వృక్షం జమ్మి చెట్టు అని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్ కొనియాడారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని ఆలంపల్లి బోనమ్మ గుడి సమీపంలో హిందువుల సంస్కృతీ సాంప్రదాయాలను అనుసరించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జమ్మి మొక్కలను నాటే కార్యక్రమాన్ని కేసిఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బోరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోదర సౌభ్రాతృత్వానికి ప్రతీకగా దసరా పండుగ నిలుస్తుందని అన్నారు. హిందువులు జమ్మి ఆకులను ఒకరికి ఒకరు పంచుకొని ఆత్మీయత అనురాగాలను స్వీకరిస్తారని గుర్తుు చేశారు. ఆలంపల్లి బోనమ్మ గుడి సమీప ప్రాంతంలో జమ్మి వృక్షాల వనం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ మేేక చంద్రశేఖర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు సుుధాంష్ కిరణ్ పటేల్, రామస్వామి, అనంత్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు సురేష్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, శంకర్, సామ ప్రభాకర్ రెడ్డి, దత్తు, దోమ నర్సింహారెడ్డి, సి.జగన్ తదితరులు పాల్గొన్నారు.