ఐక్య కార్యచరణ తోనే బీసీల హక్కులు సాధించుకోవాలి.

Published: Saturday December 17, 2022
...ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య.
 
 జన్నారం, డిసెంబర్ 16, ప్రజాపాలన: 
 
బిసి కులస్తులు ఐక్యకర్యచరణ తోనే తమ హక్కులు సాధించుకోవాలని, బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ బీసీ బందు ప్రవేశపెట్టి ఒక్కో బీసీ కుటుంబానికి 10 లక్షలు వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ బందు పథకం గురించి బీసీలు ఉద్యమించగా, ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 సంవత్సరం నుండి బీసీ బందు పథకం ప్రవేశపెడతామని మరచిపోయారని, బీసీ బందు పథకం విషయమై ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని, వెంటనే అమలు చేయాలని, వారు డిమాండ్ చేశారు. 12 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన బీసీ కులాలకు న్యాయం జరగడం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులాల వారికి అన్యాయం చేస్తున్నారని ఆయన వాపోయారు. దేశ జనాభాలో 50 శాతం పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ ఆర్థికంగా రాజకీయంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని, ఆయన గుర్తు చేశారు. బీసీ వ్యతిరేక చర్యలు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తుమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీసీ సంఘం ఉద్యమ పోరాట సమితి కో కన్వీనర్ కోడూరు చంద్రయ్య, బీసీ సంఘం ఉద్యమ పోరాట సమితి మంచిర్యాల జిల్లా సభ్యుడు శాఖపూర్ రవి, తదితరులు పాల్గొన్నారు.