రైతు గర్జన సభ,ర్యాలి ని విజయవంతం చేయండి

Published: Friday February 05, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల: ప్రజా పాలన
 
ములకలపల్లి మండలం పరిధిలో గల ములకలపల్లి లో న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.
 
ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం(AIKMS) రాష్ట్ర ప్రదాన కార్యదర్శి *కెచ్చెల రంగారెడ్డి* పాల్గోని మాట్లాడుతు రైతులను రాజులు చేస్తామన్న ప్రభుత్వాలు కార్పోరేట్ శక్తుల చేతుల్లోబందీలు వేస్తున్నారని.అంబానీ ఆదానీల కోసమే దేశ కీలక వనరులతోపాటు 60 కోట్లమంది ఆదారపడి జీవించే వ్యవసాయ రంగాన్ని.దాని మార్కెట్ ను అప్పగించే యత్నం చేస్తున్నారని..అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 3 దుర్మార్గమైన వ్యవసాయ చట్టాలను తెచ్చిందని అన్నారు.ఈదుర్మార్గ చట్టాల రద్దుకు 70 రోజులుగా లక్షలాదిమంది రైతాంగం ఆందోళన చేస్తుంటే మోడీ,అమిత్ షా ప్రభుత్వం రైతులను విదేశీశక్తులుగా చిత్రించి.అణచివేతను బ్రీటిష్ పాలకుల మాదిరిగానే చేస్తుందని ఆయన అన్నారు ఈ దుర్మార్గమైన చట్టాలను రద్దుచేయాలని అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు
అదే విదంగా కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులు గిరిజనేతర పేదలు సాగుచేస్తుంన్నటువంటి పోడు భూములను గుంజుకోని.కందకాలు తవ్వడాన్ని ఆపాలని
కెసీఆర్ ప్రభుత్వం వచ్వి 6 ఏండ్ల అయిన ఇంత వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు అర్హత కలిగిన వారందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని 
డబుల్ బెడ్ రూం యిండ్లు కల,కల్ల.పైరవి కారులకు తప్ప,అవసరమైనవారికిరావుపాత ఇందిరమ్మ యిండ్లకు బిల్లులు యివ్వాలి,స్వంత జాగ వున్నవారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి యిండ్లు కట్టుకునే అవకాశం కల్పించాలని లేని యడల ఈ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ముద్దా బిక్షం.అమర్లపుడి రాము.నూపా భాస్కర్.జి ప్రభాకర్.కె కల్పన.కె కల్లయ్య.కె కిషోర్.పి లక్ష్మణ్. ఎన్ రాంబాబు.టీ దుర్గమ్మ,కె కృష్ణ.కె పద్మ.కె గణపతి ఎన్ సరోజని.మం విజయ వై రామారావు తదితరులు పాల్గోన్నారు
Attachments are