రైతుల సౌకర్యార్థం వంతెన నిర్మాణం

Published: Saturday May 29, 2021
ఎమ్మేల్యే కందాళ కృషి తో వంతెన మంజూరు. సర్పంచ్ గండు సతీష్..
పాలేరు, మే 28 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అమ్మ గూడెం గ్రామం వద్ద రైతుల సౌకర్యార్ధం కోసం వంతెన నిర్మించినున్నట్లు  తెలిపారు. మండలంలోని అమ్మగూడెం గ్రామం వద్ద నందిగామ బ్రాంచి కెనాల్ పై నూతనంగా రూ.70 లక్షలతో నిర్మించనున్న వంతెనకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి చొరవతో ఎన్బీసీ కెనాల్ పై వంతెన మంజూరు చేసినట్లు తెలిపారు. రైతులు, ప్రజల సౌకర్యార్ధ్యం వంతెన కు ఎమ్మేల్యే తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. శిధిలావస్థలో ఉన్న వంతెన స్థానంలో నూతనంగా నిర్మించనున్నట్లు తెలిపారు ఇరుకు, శిధిలావస్థలో ఉన్న వంతెన ను తొలిగించి కొత్తగా వంతెన నిర్మించాలని ప్రజలు కోరటంతో ఎమ్మేల్యే స్పందించారని తెలిపారు. అభివృద్దే ప్రధాన లక్ష్యంగా ఎమ్మేల్యే కందాళ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పాలేరు అభివృద్ధి లో చెరగని ముద్ర వేసుకుంటున్నారని తెలిపారు. కరోనా లాంటి విపత్తు సమయంలో సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్న కందాళ లాంటి నేతలు మనకు కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్ రావు జక్కేపల్లి సోసైటీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, అమ్మగూడెం పంచాయతీ సర్పంచ్ గండు సతీష్, మాజీ సర్పంచ్ గండు జానయ్య, సుంకర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.