నేలకొండపల్లిలో ప్రపంచ ఫోటోగ్రఫీడే

Published: Wednesday August 25, 2021
ఆలేరు ఆగస్టు 19 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి పట్టణంలోని ఫోటోగ్రాఫర్స్ అండ్ విడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ ప్రదాత లూయిస్ దాగోరే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అండ్ విడియోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు జెర్రిపోతుల సత్యనారాయణ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ ని కళాకారులుగా గుర్తించాలన్నారు. అలాగే బ్యాంక్ రుణాలు డైరెక్ట్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీడేను పురస్కరించుకుని బాహు స్టూడియోలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఫోటో స్టూడియో యజమానులు మండల కార్యదర్శి కొత్త నాగిరెడ్డి, వల్లలా ఉపేందర్, ఏవిఎస్ రాజు, దండ శ్రీనివాస్, సిద్దేలప్రశాంత్, తాతహనుమంతరావు, రామగిరిరవి, కండికొండశ్రీను, కొత్తకొండ వెంకటేశ్వర్లు, జంగంఅచ్చిబాబు, పిట్టల రామకృష్ణ, వరి కుప్పల గోపి, వెంగళం చంద్రశేఖర్ చారి, వేంద్రాద్రిబాబు, జెర్రిపోతుల అంజని తదితరులు పాల్గొన్నారు.