విద్య రంగానికి బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలి. -పిడిఎస్ యు రంగారెడ్డి జిల్లా కార్యదర్శ

Published: Wednesday February 01, 2023

చేవెళ్ల జనవరి 31, (ప్రజాపాలన):-

ఈనెల ఫిబ్రవరి 03 న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించలని,చేవెళ్ల మండల కేంద్రంలో
పిడిఎస్ ఆధ్వర్యంలో సమావేశం నీవహించారు.
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యా నా కళ అన్న కెసిఆర్ నేడు నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యనంత నీరు గారుస్తున్నారని, అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రంగానికి 9 నుండి 10 శాతం నిధులు కేటాయిస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఐదు నుండి ఆరు శాతం నిధులకు పరిమితమైందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మూడ విశ్వాసాలకోసం వేల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి,  ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలకు కనీసం టాయిలెట్స్ లేని దుస్థితిని తీసుకొచ్చారు. విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడంతో 3500 కోట్లు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయన్నారు. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థలు యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారు.  అని అన్నారు. కాబట్టి తక్షణమే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు నాయకులు : చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు కోజ్జంకి జైపాల్, డివిజన్ కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్, గణేష్ తదితరులు ఉన్నారు.