మహిళలందరికీ సమాన హక్కులు ఉంటాయి : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Tuesday March 09, 2021

వికారాబాద్ జిల్లా మార్చి 08 ( ప్రజాపాలన ప్రతినిధి ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సోమవారం జిల్లా ఎస్పి ఎం.నారాయణ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నెపల్లి చౌరస్తా నుండి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వరకు రెండు కిలోమీటర్ ల  2K రన్ నిర్వహించారు. ఇట్టి పరుగును జిల్లా కలెక్టర్ పౌసుమి బసు జెండా ఊపి ప్రారంభించారు. పరుగు పందెంలో జిల్లా కలెక్టర్, ఎస్పితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థినిలు, మహిళలు, పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా వికారాబాద్ జిల్లా ప్రజలందరికి 107 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ్యకాంక్షలు తెలియజేశారు. మహిళలు అందరికి అన్ని విషయాలలో సమాన హక్కులు ఉంటాయని, అందరు ఇట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందాలని సూచించారు.  ప్రతి విద్యార్థిని తమ లక్ష్యాలను వాటి లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు.  నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని, అభివృద్ధితో పాటు మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యమే మహా భాగ్యమని తెలిపారు.  కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పి నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఎస్పి నారాయణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో తమ సత్తా చాటాలని, పోలీస్ శాఖలో కూడా రాణిించాలని  సూచించారు. మహిళలు, విద్యార్థినులకు పోలీస్ శాఖ అన్ని వేళల రక్షణగా అందుబాటులో ఉంటుందని తెలియజేసినారు.  తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల లింగ భేదం చూపకుండా పెంచి సమాజంలో మార్పునకు నాంది పలుకాలన్నారు.  2K రన్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కు, అధికారులకు, విద్యార్ధినులకు జిల్లా ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానిక డిపిఆర్ సి భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహంచారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అబ్బాయిలు, అమ్మాయిలు అనే లింగ బేధం లేకుండా చూడాల్సిన భాద్యత తల్లితండ్రులదే అని సూచించారు. ఇంటి పనులలో పురుషులు మహిళలకు సహకరించాలని తెలియజేశారు. మహిళలు తమ ఆడపిల్లలకు మంచి విద్యను అందించి సమాజంలో ఉన్నత స్థాయిలో స్థానం కల్పించాలన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు, సంక్షేమ శాఖలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు  కలెక్టర్  బహుమతులు అందజేసినారు.  2కె పరుగు పందెంలో విజేతలుగా నిలిచిన ముగ్గురు విద్యార్ధినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, అదనపు ఎస్పీ రషీద్, DWO లలితకుమారి, డీపీవో రిజ్వానా, బిసి సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, వికారాబాద్, తాండూర్, పరిగి డిఎస్పీ లు, సంజీవ రావు, లక్ష్మి నారాయణ, శ్రీనివాస్ లు, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు, సఖి సెంటర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.