మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలి * *డి.కిషన్ యూనియన్ జిల్లా ప్రధాన

Published: Thursday December 08, 2022

  *మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వీరికి ప్రథమ ప్రాధాన్యత నుంచి అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లుగా వేతనాలు రూ.21,000/- లు  పెంచాలని మరియు కార్మికుల ఈఎస్ఐ, ఇపీఎఫ్ లలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కిషన్ ఆధ్వర్యంలో  తుర్కయంజాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించి మున్సిపల్ మేనేజర్ బి శ్రీనివాసులు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది,
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కిషన్ మాట్లాడుతూ* మున్సిపల్ కార్మికుల్లో అత్యధికులు దళిత గిరిజన బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు మాత్రమే ఈ పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నారని, సమాజంలోని ఇతర కులాలు వర్గాల వారు అసహ్యించుకొని దూరంగా ఉన్న నేపథ్యంలో దళితులైన మున్సిపల్ కార్మికులు సమాజ హితం కోరి తరతరాలుగా ఈ పనుల్లో కొనసాగుతున్నారని వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని అన్నారు ఇలాంటి కార్మికులకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని మున్సిపల్ కార్మికులకు మొదటి క్రమంలో అమలు చేయాలని ప్రతి కార్మికునికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు లేదా ఇళ్లస్థలాలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  సమాజ శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతూ మునిసిపల్ పనులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మరియు ఇతర కేటగిరీల కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు పని భారంతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని విరామం లేకుండా పనిచేయడం వల్ల అనారోగ్యాలకు గురవుతూ జబ్బుల బారిన పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే కార్యక్రమాలను జయప్రదం చేసే సందర్భంలోనూ రోజుకు ఎనిమిది గంటలు పని చేయాల్సిన వీరు 10 నుండి 12 గంటలు పని చేయాల్సి వస్తుందని ఈ క్రమంలో పోరాడి సాధించుకున్న వారాంతపు సెలవు కూడా కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు, కాబట్టి మున్సిపల్ కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని క్రమం తప్పకుండా ఒక్క పూటలోనే అమలు చేయాలని, రక్షణ పరికరాలు రెగ్యులర్గా అందజేయాలని, ఆదివారంతో పాటు జాతీయ మరియు రాష్ట్ర పండుగల సందర్భంగా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మేతరి దాసు, నాయకులు నవీన్ రవి పెంటయ్య జంగయ్య చంద్రయ్య మల్లయ్య యాదయ్య కుమార్ కృష్ణ రాజు శ్రీరాములు  మహేష్ జ్యోతి లక్ష్మమ్మ కమలమ్మ భాగ్యమ్మ జంగమ్మ అండాలు అరుణ దీపిక మంజుల పొన్నమ్మ తదితరులు పాల్గొన్నారు,