ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

Published: Saturday August 06, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 05 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఈ నెల 7న నిర్వహించబోయే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం పరీక్ష నిర్వాహక అధికారులతో జూమ్ యాప్ (ఆన్లైన్)లో పరీక్షా కేంద్రాల చీఫ్ సూపర్నెంట్స్, అబ్జర్వర్లు, రీజనల్ కోఆర్డినేటర్స్, పోలీస్ ఉన్నతాధికారులతో,ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 3 పరీక్షా కేంద్రాలు, కాజల్ నగర్ లో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 14 92 మంది అభ్యర్థులు రాత పరీక్షకు  హాజరవుతున్నట్లు తెలిపారు. చీఫ్ సూపర్డెంట్లు 6,అబ్జర్వర్లు 6, రూట్ ఆఫీసర్స్ 2, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్12, ఇన్విజిలేటర్స్ 63, సూపర్వైజర్ 01, విధులు నిర్వహిస్తారని తెలిపారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ పరీక్ష ఉదయం 10 గం నుండి, మధ్యాహ్నం 01గంటల వరకు నిర్వహించబడుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించరాదన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు మాస్క్ ధరించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, డిఎస్పి శ్రీనివాస్, కాగజ్నగర్ డిఎస్పి కరుణాకర్, పోలీస్ మతాధికారులు, పరీక్ష కేంద్రాల అధికారులు పాల్గొన్నారు.