మహిళలు స్వయం ఉపాధి శిక్షణతో ఆర్థికాభివృద్ది సాధించాలి నేలకొండపల్లి ఎంపిడిఓ. ఎం.చంద్రశేఖర్..

Published: Friday December 17, 2021
పాలేరు డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : మహిళలు స్వయం ఉపాధి శిక్షణతో ఆర్థికాభివృద్ది సాధించాలని నేలకొండపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం.చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండలపరిధిలోని చెరువుమాధారం గ్రామంలో నెహ్రు యువ కేంద్రం సహకారంతో జాగృతి యువతీ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు నెలల ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకుని పట్టుదలతో శిక్షణ పొంది తద్వారా అభివృద్ధి చెంది పదిమందికి ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పి.శ్రీనివాస్, జాగృతి యువతి మండలి అధ్యక్షురాలు పగడాల కల్యాణి, జక్కుల వెంకటరమణ, నాన్న స్వచ్చంద సభ్యులు మాధవి, రవి, ఎన్. వై. కె వాలంటీర్ సుధీర్, టైలరింగ్ టీచర్ యోహాన్, తదితరులు పాల్గొన్నారు.