గజ్వేల్ రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

Published: Wednesday July 20, 2022
హైదరాబాద్ 18 జులై ప్రజాపాలన:
రోటరీ క్లబ్ గజ్వేల్  నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం. 
గజ్వేల్ రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యుల ఎంపిక జరిగినట్లు రోటరీ క్లబ్ గవర్నర్ తెలియజేశారు.
 
రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వెల్  అధ్యక్షులు  ఏనుగు బాపురెడ్డి, కార్యదర్శి  కె. బాబు గౌడ్ , కోశాధికారి సామల నర్సింహా రెడ్డిల  ప్రమాణ స్వీకారం ను  తాళ్ల రాజశేఖర్ రెడ్డి గవర్నర్ ఆద్వర్యంలో సోమవారం నాడు జరిగిందన్నారు. గజ్వెల్ నూతన కార్యవర్గానికి పలువురు రోటేరియన్ లు స్థానిక నాయకులు ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ గవర్నర్ కుంట కరుణాకర్ రెడ్డి , అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి,  ఏరియా చైర్మన్ గ్రామ వికాసం కొడాలి చంటి , దాస జగదీశ్వర్ మాజి అధ్యక్షులు, గజ్వెల్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, గజ్వెల్ సెంట్రల్ సభ్యులు, జగదేవపూర్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.