ఎయిడ్స్ పై యువకులు అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ

Published: Friday December 02, 2022
బోనకల్, డిసెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి వారికి అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు ప్రజలతో మమేకమై అందరికీ అవగాహన కల్పిస్తూ గ్రామపంచాయతీ ముందు మానవహారంగా ఏర్పడి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా యువతీ యువకులకు సంక్రమిస్తుందని, హెచ్ఐవి ఎయిడ్స్ పై ముఖ్యంగా యువకులు అప్రమత్తంగా ఉంటూ తమ తమ గ్రామాల్లో అవగాహన కల్పించవలసినదిగా పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ ,సి హెచ్ ఓ పి శ్రీనివాసరావు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుండి పాఠశాల కళాశాలలో దీనిపై అవగాహన కల్పించాలని, తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలని, హెచ్ఐవి ఎయిడ్స్ నాలుగు రకాలుగా వ్యాప్తి చెందుతుందని, మొదటిది కలుషితమైన సూదులు సిరంజీల వలన , అనైతిక లైంగిక సంబంధాల వలన కలుషితమైన రక్త మార్పిడి ద్వారా గర్భిణీ తల్లి నుండి పుట్టబోయే బిడ్డకి ఈ వ్యాధి సంక్రమిస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎన్ బాలకృష్ణ, సి హెచ్ ఓ, పి శ్రీనివాసరావు. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నళిని శ్రీ. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, న్యూ జూనియర్ కాలేజ్ సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్స్ ఎం దానయ్య, స్వర్ణమార్తా, డీఈవో నాగేశ్వరరావు , ఎన్ ఎస్ ఎస్ పి ఓ యు రామకృష్ణ , ఏఎన్ఎమ్స్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.