ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday January 04, 2023

*స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో*

* సావిత్రి బాయి పులే జయంతి*

*తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి ఫూలే*

*సమస్యలపై మడమ తిప్పని పోరాటమే ఆమె ధీరత్వం, ఆకలిగొన్న వారికి కడుపు నింపడమే ఆమె ఆరాటం, సమాజంలో అసమానతలు తొలగించడమే ఆమె లక్ష్యం. అక్షర సమాజం ద్వారా సమాజ అభ్యున్నతే ఆమె జీవిత ధ్యేయం. ఆమె శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. అట్టడుగు వర్గాల, మహిళల హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను దిక్కరించిన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి అణగారిన వర్గాల మాతృమూర్తి శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించింది. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడి, కుల వ్యవస్థ పునాదులను పెకలించి శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాడటం సామాజిక బాధ్యతగా స్వీకరించిన ధీశాలి.

శ్రీ గాయత్రి డిగ్రీ మరియు జూనియర్ కళాశాల ,
అశ్విత డిగ్రీ మరియు వసుంధర జూనియర్ కళాశాల
కార్తికేయ డిగ్రీ మరియు జూనియర్ కళాశాల
ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న కళాశాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థులు,  మండల అధ్యక్షుడు చెరుకూరి చిరంజీవి ఎస్ ఎస్ యు ఐ బి పి, ఎస్ ఎస్ యూ మండల అధ్యక్షులు మరియు సుమన్ ఎస్ ఎస్ యు నాయకులు పాల్గొన్నారు,