కరోనా మహమ్మారి వైరస్ తో పోరాడి మరణం పొందిన జర్నలిస్ట్ భృంగి శశివర్ణం కి శ్రద్ధాంజలి

Published: Tuesday May 11, 2021
బాలపూర్(ప్రతినిధి) ప్రజా పాలన : జర్నలిస్ట్ భృంగి శశివర్ణం  ఎన్నో పత్రికల్లో పని చేసి అద్భుతమైన కథనాలను రాసి  తెలంగాణలో ఉద్యమంలో నేను సైతం అంటూ పోరాడిన జర్నలిస్ట్ శశివర్ణంకి శ్రద్ధాంజలి ఘటించినటీ డబ్ల్యూజేఎస్ అధ్యక్ష కార్యదర్శులు, కంట్ఠం సైదయ్య, తీగల సైదులు, రంగారెడ్డి జిల్లా ఆధీభట్ల నమస్తే తెలంగాణ జర్నలిస్ట్, బృంగి శశివర్ణం వివిధ పత్రికల్లో పనిచేసి ఎన్నో అద్భుతమైన కథనాలను రాసి పేరుతెచ్చుకున్న ఆయన తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్నరు. కోవిడ్ బారిన పడి గురువారం ఆయన మరణించారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూ జేఎస్ అద్వర్యం ఆదివారం కొత్తపేట చౌరస్తాలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ అధ్యక్షుడు సైదయ్య, ప్రధాన కార్యదర్శి సైదులు మాట్లాడుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే శశివర్ణం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి  ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, 25 లక్షల రూపాయలు, నెలకు 50 కిలోల బియ్యాన్ని కరోన కాలంలో లో అందజేయాలని, అన్నారు. అలాగే కరోన బారిన పడి చనిపోయిన జర్నలిస్టుల అన్ని కుంటుంబలకు ఇది వర్తించేటట్లు ప్రకటన చేయాలని కోరారు. నేడు వృత్తి నిర్వహణలో భాగస్వామ్యం అయి సమాచాన్ని అందిస్తున్న వారికి ఈ విపత్కర పరిస్థితుల్లో 25 వేల రూపాయలు, 50 కిలోల బియ్యాన్ని అందజేయాలని వారు ప్రభుత్వన్ని కోరారు. ఈ కార్యక్రమనికి జర్నలిస్ట్ యూనియాన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు వీరమల్లా లింగయ్య గౌడ్, వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరమ్ జాతీయ అధ్యక్షుడు లవుడియా శంకర్ చౌహన్, సీనియర్ జర్నలిస్ట్ కురుపాటి యువరాజ్, అవిరేను రాంమోహన్ నేత, పి.వి సుధాకర్, వంటపాక విజయ్, ఎన్జీవో నాయకులు ఆశోక్, ఆనంద్, విశ్వనాథ్, రాజు, బాలు, రవి, పురుషోత్తం, ఎస్ కాంచన చారి తదితరులు పాల్గొన్నారు.