పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, నూనెలు పంపిణీ

Published: Thursday July 15, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన న్యూస్ : కార్పొరేషన్ ను పరిశుభ్రంగా ఉంచడానికి విధి నిర్వహణ (పారిశుద్ధ్య సిబ్బంది) కార్మికుల కనీస అవసరాలకు అనుగుణంగా సహాయ సహకారాలు అందించాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో పని చేస్తున్న శానిటేషన్ సిబ్బందికి ప్రతి సంవత్సరం ఇస్తున్న సబ్బులు, కొబ్బరినూనెలు ఈ ఏడాది కార్పొరేషన్ కార్యలయంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసే కార్యక్రమానికి, కార్పొరేషన్ అధికారులతో పాటు డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, లతో కలిసి పారిశుద్ధ్య సిబ్బందికి  డజను ఫైయ (ఒంటి) సబ్బులు, బట్టల సబ్బులు, అదే విధంగా అరడజను కొబ్బరినూనె డబ్బాలు,అలాగే సి డి ఎం ఏ  వారి ద్వారా వచ్చిన రెండు ఎల్ ఈ డి  బల్బులు, ఒక దుప్పటిని శానిటేషన్ సిబ్బందికి  బుధవారం నాడు మేయర్ అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.... అహర్నిశలు కార్పొరేషన్ పరిశుభ్రంగా ఉంచడానికి పని చేస్తున్న కార్మికులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం అని అన్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు శుభ్రపరిచినందువల్ల ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తిరిగే మనుషులు ఉన్నారని అన్నారు. వారి సేవలు లెక్క కట్టలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, డీఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, సుర్ణగంటి అర్జున్, సుక్క శివ కుమార్, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రఘునందన చారి, నాయకులు రామోజీ శ్రీశైలం చారి, లిక్కి కృష్ణ రెడ్డి, కార్పొరేషన్ అధికారులు మేనేజర్ శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.