అనంతగిరిపల్లి, కొత్తగడి పాఠశాలలో పుస్తకాల పంపిణీ

Published: Tuesday February 21, 2023
* వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు
వికారాబాద్ బ్యూరో 20 ఫిబ్రవరి ప్రజాపాలన : విజ్ఞానార్జనకు పుస్తక పఠనం ఎంతో ఉపయోగపడుతుందని వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు అన్నారు. సోమవారం వికారాబాద్ మునిసిపాలిటీలోని  అనంతగిరిపల్లి, కొత్తగడి పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదినము సందర్భంగా ఫిబ్రవరి 17న జిల్లాలోని బంట్వారం, ధారూర్ మండల కేంద్రాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వడ్లనందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు. వడ్ల నందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి, కొత్తగడి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను స్థానిక కౌన్సిలర్ జైదుపల్లి మురళి, యువ నాయకులు రాజుతో కలిసి పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అధిక శాతం పేద విద్యార్థులన్న సందర్భంగా వారికి పుస్తకాలు అందించి విద్య పరంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు భవిష్యత్తు పౌరులుగా ఎదగాలనీ ఆయన ఆకాంక్షించారు.