అసంఘటిత కార్మికులకు కోవిడ్ టీకా వేయడానికి రిజిస్ట్రేషన్.

Published: Tuesday June 08, 2021

బెల్లంపల్లి, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారస్తుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ స్పైడర్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య ఆదేశానుసారం వివిధ ఏరియాల్లో షాప్ల వద్ద నమోదు చేపట్టామని 16వ వార్డ్ కౌన్సిలర్ ఎలిగేటి సుజాత శ్రీనివాస్, 12వ వార్డ్ కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ తెలిపారు. సోమవారం నాడు తమ వార్డు పరిధిలోని పాత బస్టాండ్ ఏరియాలోని వ్యాపారస్తులకు మరియు షాప్ లలో పనిచేసే గుమస్తాలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని 12వ వార్డులో కూరగాయల సంత మెడికల్ షాపులు కిరాణా షాప్ స్వీట్ హౌస్లో నమోదు కోసం రిజిస్ట్రేషన్ చేయించమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, బిల్ కలెక్టర్ లక్ష్మణ్, మరియు ఆర్ పి అరుణ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.