సంస్థలో పనిచేసే పర్మినెంట్ కార్మికులను సెక్యూరిటీ గార్డులను నియమించాలి టీబీజీకేఎస్ నాయక

Published: Wednesday June 15, 2022
బెల్లంపల్లి జూన్ 14 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి ఏరియా లో పర్మినెంట్ సెక్యూరిటీ గార్డుల తో పాటు   సంస్థలో పనిచేసే జనరల్ మజ్దూర్ లను, సెక్యూరిటీ కోసం  నియమించాలని, బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు, కొత్తగూడెం చీఫ్ సెక్యూరిటీ అధికారికి ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం  బెల్లంపల్లి ఏరియా గోలేటి కి పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు విజ్ఞప్తి పత్రం అందజేశారు,
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెల్లంపల్లి ఏరియా గోలేటి ప్రాంతంలో సింగరేణి గనులు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నందున, అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగి ఉండడం వల్ల, గతంలో నకిలీ రిసిప్ట్ లు, సమర్పించి బొగ్గును తీసుకెళ్లిన సంఘటనలు జరిగాయని, దానివల్ల సంస్థ నష్టాలకు గురి అయ్యే అవకాశం ఉన్నందున, సంస్థలో పనిచేసే సెక్యూరిటీ గార్డులతో పాటు జనరల్ మజ్దూర్ లను నియమించాలని ఆయన కోరారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా, యాజమాన్యం పర్మినెంటు సెక్యూరిటీ గార్డులతోపాటు మరియు రికార్డింగ్ పోస్టుల్లో, పెట్రోలింగ్, టాస్క్ ఫోర్స్, మొబైల్, పార్టీ ల్లో కూడా ప్రైవేటు వారిని నియమిస్తున్నారనీ, ఇదంతా సింగరేణి సంస్థ భద్రతకు ఇబ్బందికరంగా మారుతుందని, అన్నారు.
 సంస్థలో పని చేస్తున్న పర్మినెంట్ సెక్యూరిటీ గార్డులతో పాటు చదువుకున్న జనరల్ మజ్దూర్ లను ఆయా స్థానాల్లో  నియమించాలని ఆయన అన్నారు.
రానున్న రోజుల్లో కష్టపడి పనిచేసి  తీసిన బొగ్గు, లేదా కంపెనీకి చెందిన విలువైన సామాగ్రి, దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని, దానికి కంపెనీ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కాబట్టి సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులను, సింగరేణి సెక్యూరిటీ విభాగంలో నియమించే ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు.
 ఈ కార్యక్రమంలో చర్చల కమిటీ ప్రతినిధి మంగీలాల్, వివిధ డిపార్ట్ మెంట్ల ఫిట్ కార్యదర్శులు, జీ యం కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.