ఆదివాసీ గిరిజనులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

Published: Tuesday April 27, 2021
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 26, ప్రజాపాలన ప్రతినిధి : కొత్తగూడెం సుజాతనగర్ మండలం పాత అంజనాపురం గ్రామంలో ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కంఠం నాలుగు ఎకరాల భూమిలో వందలాది మంది ఆదివాసీ గిరిజనులు జెండాలు పాతి ఆక్రమణ చేయడం జరిగింది ఈ పోరాటానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. సిపిఎం గొర్రెల మేకల సంఘం నాయకులు జాటోత్ కృష్ణ వీర్ల రమేష్ కాట్రేవుల తిరుపతిరావు గండమళ్ళ భాస్కర్ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా పాత అంజనాపురం కొత్త అంజనాపురం మేడిపల్లి గ్రామాలకు సంబంధించి ఆదివాసీ గిరిజనులు ఇళ్ల స్థలాలు కావాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు గ్రామంలో కొంతమంది చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ భూమిని గ్రామకంఠం భూమి అక్రమంగా ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో అనేక ఉద్యమాల ఫలితంగా రెవెన్యూ అధికారులు గ్రామపంచాయతీ అధికారులు భూమిని సమగ్రంగా సర్వే చేయగా ప్రభుత్వ భూమి గ్రామకంఠం భూమి ఐదు ఎకరాల భూమి తేలిందని అట్టి భూమిని ఇళ్ళ స్థలాలకు గిరిజనులకు పంచుతామని అనేకసార్లు అధికారులు గిరిజనులకు హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేరకపోవడంతో తో నేడు గిరిజనులు ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ని వేసుకొని పోరాట కమిటీ నాయకత్వంలో జెండాలు పాతి ఆక్రమణ చేయడం జరిగింది ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు అట్టి భూమిని సమగ్రంగా సర్వే చేపించి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం గొర్రెల మేకల సంఘం ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అట్టి భూమిలో గుడిసెలు వేసి నిరుపేదలకు పంచుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు ఉద్యమకారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వారం రోజులలో భూమిని సమగ్ర సర్వే జరిపి ఇళ్ల స్థలాల ను ఆదివాసి గిరిజనులకు పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు స్థానిక తహసిల్దార్ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు నాగరత్నమ్మ సావిత్రి స్వరూప నాగమణి అమృత రాంబాబు వాసు నాగరాజు పి గోపాల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు