అమీర్ పేట్ డివిజన్ లో క్రిస్టమస్ కానుకలు పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ శేషుకుమారి.

Published: Monday December 20, 2021
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : కులాలకు, మతాలకు అతీతంగా అన్ని పండుగలు ఘనంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వానికి ఆనవాయితీ అని అన్నారు అమీర్ పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి. తెలంగాణ ప్రభుత్వం తరుపున ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్ పేట్ డివిజన్ చర్చిలకు దాదాపు 500 క్రిస్టమస్ కానుకలు స్థానిక మాజీ కార్పొరేటర్ శేషు కుమారి గారు మరియు డివిజన్ అధ్యక్షుడు, స్థానిక తెరాస నేతల ద్వారా అందించారు. ప్రభుత్వం తరుపున ఈ నెల 23న వివేకానంద కమ్యూనిటీ హాల్ లో క్రిస్టమస్ విందు ఏర్పాటు చేయనున్నట్లు  కావున పెద్ద ఎత్తున మైనారిటీ సోదర సోదరీమణులు పాల్గొనాలని  శేషు కుమారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే సీ ఆర్ ప్రతి ఒక్క మతాన్ని ఒకేలా చూస్తారని తెలంగాణ ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవాలని దసరా, రంజాన్, క్రిస్టమస్ కు ప్రభుత్వం తరుపున గిఫ్ట్స్ ఇస్తున్నారని, ముఖ్య మంత్రి ఎప్పుడు ప్రజా పక్షం, ప్రజల మనిషి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్ శేషు కుమారి గారు, సీనియర్ నాయకుడు అశోక్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్, నేతలు నరసింహ, జితేందర్, వివేక్ నాథ్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.