రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వలు శంకరపట్నం ప్రజాపాలన ప్రతినిధి నవంబర్ 23

Published: Thursday November 24, 2022
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ ధ్వజమెత్తారు. శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య ఆధ్వర్యంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ధరణి వెబ్సైట్ పేరుతో భూ రికార్డులను నిర్వహించే బాధ్యతను విదేశీ కంపెనీలకు అప్పగించడం ప్రభుత్వాల బాధ్యతారహితానికి నిదర్శనమని ఆరోపించారు. పేద ప్రజలకు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టడం లేదని ఆయన విమర్శించారు. నిజాం కాలం నుండి భూమి రికార్డుల నిర్వాహణ బాధ్యత చీప్ ఇంజనీర్ లా అడ్మినిస్ట్రేషన్ ఉండేదని, ఇప్పుడు కూడా పూర్వపు విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఏటా రెండు పంటల కాలాలకు కౌలు చేసుకునే రైతులకు హక్కులు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్,మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, గ్రామ అధ్యక్షుడు మోలంగురి  సదానందం, ఎండి జాంగిర్, కూరెళ్ళ ప్రశాంత్, ఎండి ఇస్సాముద్దీన్ , తాడిచెర్ల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు