తక్కువ ఖర్చుతో ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సరుకు రవాణా

Published: Saturday February 25, 2023

మధిర ఫిబ్రవరి 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో సరుకులు రవాణా

లాజిస్టిక్స్ ఏటీఎం వేణు గోపాల్  
అతి తక్కువ ఖర్చుతో వేగంగా భద్రంగా మీకు అతి చేరువగా టి ఎస్ ఆర్ టి సి లాజిస్టిక్ ద్వారా సరుకు రవాణా చేయబడును అని లాజిస్టిక్స్ ఏటీఎం వేణు గోపాల్అన్నారు.  శుక్రవారం మధిర బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన లాజిస్టిక్ నూతన పిసిసి ఏజెంట్ కౌంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా సరుకు రవాణా సుదూర ప్రాంతాలకు సైతం తక్కువ సమయంలో చేరవేయడం జరుగుతుందని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా లాజిస్టిక్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మధిర పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని ఆయన కోరారు. అతి తక్కువ ఖర్చుతో వేగంగా భద్రంగా సరుకు రవాణా చేయడంలో టిఎస్ఆర్టిసి లాజిస్టిక్స్ ముందుందని వారు పేర్కొన్నారు. లాజిస్టిక్స్ పాయింట్ ప్రారంభించిన అనంతరం మధిర పురవీధులలో మైకుల ద్వారా లాజిస్టిక్ కరపత్రాలు అందజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర డిపో మేనేజర్ దేవదానం, లాజిస్టిక్స్ ఏటీఎం ఎం వేణుగోపాల్, రీజనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హరి వర్మ,  పాల్గొన్నారు.