దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన వైద్య అధికారిగా డాక్టర్ కిషోర్ తాల్క

Published: Wednesday November 17, 2021
హైదరాబాద్ నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖలో చాలా కాలంగా ఖాలీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయాలని సంబంధిత శాఖ ఆదేశాలమేరకు వివిధ జిల్లాల్లోని పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. దీనిలో బాగంగా జనగాం జిల్లా లో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. జనగాం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్.ఎ.మహెందర్ ఆద్వర్యంలో ప్రతిభా ఆధారంగా  పారదర్శకంగా. అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. నవంబర్ 11వ తేదీన ఎంపిక అయిన అభ్యర్థులకు  పోస్టింగ్స్ అనుమతులను అందజేశారు. ఇందులో భాగంగా దేవరుప్పుల  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా డాక్టర్.కిషోర్ తాల్క మంగళవారం నాడు డిడిఒ డాక్టర్ భాస్కర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్. జ్ఞానేశ్వర్ ఆద్వర్యంలో పదవి బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.