ఇంట్లోనే ఉందాం కరోనాను తరిమికొడదాం

Published: Tuesday May 04, 2021
పాలేరు మే 3 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా:-నేలకొండపల్లి కరోనా నియంత్రణ కు నిర్భంధమే శ్రీరామరక్ష అని కోనాయిగూడెం సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ సూచించారు. మండలంలోని కోనాయిగూడెం గ్రామపంచాయతీ లో సోమవారం సిబ్బంది కి పీపీఈ కిట్స్ ను పంపిణీ చేశారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రం, ఆశా కార్యకర్త, గ్రామ పంచాయతీ కార్యాలయం కు పల్స్ ఆక్సిమీటర్స్ లను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి ని తరిమికొట్టేందుకు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. భౌతికదూరం పాటించటం, మాస్క్లు ధరించటం తప్పుకుండా అమలు చేయాలని కోరారు. గ్రామాల్లో పెళ్లిలు చేసుకునే వారు స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలుకు లోబడి కార్యక్రమాలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ వడ్లమూడి నర్సయ్య, కార్యదర్శి బోళ్ల వీరబాబు, అంగన్వాడీ టీచర్ వి.నాగమణి. ఆశా కార్యకర్త చెరుకుపల్లి బేబి, పంచాయతీ సిబ్బంది బొడ్డు ఆంజనేయులు, కస్తాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.