భక్త రామదాసు జ్ఞాన మందిరం లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జన్మదినం..

Published: Thursday February 17, 2022
పాలేరు పిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తరామదాసు ధ్యానమందిరంలో వున్నం బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు జరపాలని TRS పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేలకొండపల్లి తెరాస మండల అధ్యక్షుడు ఉన్నాం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు  ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తరామదాసు ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నాం బ్రహ్మయ్య, మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రైతుబందు, 24 గంటల కరెంటు, ఇంటింటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారని  చెప్పారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణ ను మరింత అభివృద్ధి లోకి తీసుకెళ్తారని ఉన్నాం బ్రహ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మాజీ సర్పంచి వంగవీటి నాగేశ్వరరావు, టౌన్ సెక్రటరీ మండల యూత్ అధ్యక్షుడు గొలుసు రవి, కో ఆప్షన్ సభ్యుడు యం డి వాజిద్, మాజీ ఉపసర్పంచి రాజు పుత్ర శ్రీనివాస్ సింగ్, టిఆర్ఎస్ పార్టీ నెంబరు కొండ కనకప్రసాద్, కూరాకుల నాగేశ్వరరావు, గోరింట్ల చంటి, తన్నీరు సత్యనారాయణ, కడియాల నగేష్, మాదాసు ఆదాం, తదితరులు పాల్గొన్నారు