ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

Published: Monday November 22, 2021
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 21, ప్రజాపాలన : మంచిర్యాల పట్టణం ఏ సి సి లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మత్స్యకారుల సంఘం జిల్లా అద్యక్షుడు నెన్నల నరసయ్య జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగ పుత్రులు రాష్ట్ర జనాభా లో 35 లక్షలు ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ సముచిత న్యాయం చేసిన దాఖలాలు లేవని అన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో అత్యంత వెనుకబడిన గంగా పుత్రులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మంచిర్యాల గోదారి ఒడ్డున గంగా దేవి ఆలయం నిర్మాణానికి 5 గుంటలు ఇవ్వాలి కోరారు. గంగపుత్రుల భవన నిర్మాణానికి ఒక ఎకరం భూమి కేటాయించాలని, మంచిర్యాలలో మోడ్రన్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గంగపుత్రుల జనాభా ప్రతిపాదికన స్థానిక సంస్థలలో అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు నే న్నెలా నరసయ్య పట్టణ అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్ నాయకులు చేతి నరసయ్య చేతి బాలరాజు కోటేశ్వరరావు గంధం శంకర్ జి.శ్రీధర్ చుక్కల రమేష్ ఆరుద్ర శ్రీనివాస్ రాజేంద్ర ప్రసాద్ మం చర్ల సదానందం నరేందర్ నాగరాజ్ బోర చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.