బడ్డీకొట్ల తొలగింపు-ఫలించని రాస్తారోకోలు, ధర్నాలు

Published: Thursday April 14, 2022

మధిర ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో బుధవారం నాడు అధికారులతో బడ్డీ కొట్లు తొలగింపు కార్యక్రమం బడ్డీ కొట్టు కోల్పోయిన వారు లబోదిబో అంటూ అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధి నీటికొటి మీద రాతలలా నేతల హామీలు. ప్రత్యామ్నాయం చూపకుండానే బడ్డీకొట్ల తొలగింపు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వందల కుటుంబాలు మధిరలో బడ్డీకొట్లను తొలగించటంలో అధికారులు పంతం నెగ్గించుకున్నారు. అఖిలపక్ష పార్టీలతో ధర్నాలు, రాస్తారోకోలు చేసినా చిరు వ్యాపారుల ప్రయత్నం ఫలించలేదు. న్యాయం చేస్తాం, ప్రత్యామ్నాయం చూపిస్తాం అన్న నేతల మాటలు నీటి మీద రాతలలాగా అదృశ్యమయ్యాయి. దీంతో వందల బడుగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మధిర నుండి ప్రాథినిద్యం వహిస్తున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల రాజులు వ్యాపారులకిచ్చిన హామీలు నెరవేరలేదు. దాదాపు 40 ఏళ్ళ నుండి ఉపాధి మార్గాన్ని ఎంచుకొని వ్యాపారం చేసుకుంటూ పిల్లలను చదివిస్తూ, ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ జీవనం సాగిస్తున్న చిరువ్యాపారుల కుటుంబాలు అర్ధాంతరంగా రోడ్డునపడ్డాయి. కనీసం ప్రత్యామ్నాయ మార్గం చూపించలేదు. కొంతమంది అధికారుల పంథానికి వందల కుటుంబాల ఉపాధి మార్గాలు దెబ్బతిన్నాయి. బడ్డీకొట్ల తొలగంపు వ్యవహారంలో ఇప్పటికీ ఏఒక్క అధికారి పేరుతో ఆర్డర్ కాపీ లేకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోనే తొలగిస్తున్నట్లు వినికిడి. మధిరలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నది నిజమే అయినా కొన్ని నిబంధనలతో వాటిని పరిష్కరించవచ్చు కానీ ఉన్నపళంగా బడ్డీకొట్లను తొలగించి వారి ఉపాధి మార్గాన్ని నాశనం చేయటం వ్యవస్థాపరమైన లోపం. మధిర మెయిన్ రోడ్డులో డ్రైనేజి కాలువలు, నాళాలు ఆక్రమించి నిత్యం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించిన బడా వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిబద్ధతపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చిరు వ్యాపారుల ఆర్తనాదాలు మధిరలో ఉన్న ఏఒక్క నేత, అధికారిగానీ చివరకు ఏ దేవుడూ ఆలకించనే లేదు. బడ్డీకొట్టు జీవనాధారపై ప్రజాప్రతినిధులు ఆలోచించుకోబడుగుల నోటికాడ బువ్వలాక్కున్న ఏ ఒక్కరూ బాగుపడరూ కొందరి శాపనార్ధాలూ ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటూ తెలిపారు