ఋణ ప్రణాలిక విడుదల చేయాలి : సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు

Published: Saturday June 19, 2021
బోనకల్, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభమై, ఇప్పటికే మండలంలో కొన్నిచోట్ల మెట్ట పంటలు వేశారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఋణ ప్రణాళిక విడుదల చేయలేదని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు అన్నారు. శుక్రవారం రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైన సిపిఐ పార్టీ రాయన్నపేట కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు, ఎరువుల కొరకు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, కల్తీ విత్తనాల బెడద కూడా తీవ్రంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ సీజన్లో 75 లక్షల ఎకరాల్లో పత్తి వేయాలని ప్రకటించారని, కానీ అందుకు తగిన విత్తనాలు మండల కేంద్రాలలో అందుబాటులోఉంచడంలోవిఫలమయ్యారన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని కల్తీ వ్యాపారులు రెచ్చిపోయి తమ కల్తీ దందా కొనసాగిస్తున్నారని, పాలకూర నుండి పత్తి విత్తనాల వరకు కోట్ల రూపాయల్లో కల్తీ  విత్తనాలు పట్టుబడుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయని యంగల తెలియజేశారు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకొని, వారి లైసెన్లు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సమితి తూము రోషన్ కుమార్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల రామారావు, శాఖ కార్యదర్శి ఏలూరి పూర్ణచందు, మరిదు ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.