రాజ్యాంగాన్ని కాదు సీఎం కేసీఆర్ ని మార్చాలి

Published: Friday February 04, 2022

ఎర్రుపాలెం ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి: రాజ్యాంగం మార్చలన్న బిజెపి కుట్రలకు సీఎం కేసీఆర్ వంత పాడటంపై ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ ఈరోజు రైల్వే స్టేషన్ సెంటర్లో అంబెడ్కర్ విగ్రహం ఎదురుగా కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కొత్త రాజ్యాంగాన్ని కాదు.ఈ రాష్ట్రానికి కొత్త సీఎం కావాలని  ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగం రద్దు చేయాలని బిజెపి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కుట్రలను ముందుకు తీసుకెళ్లే విధంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. భారత రాజ్యాంగం మార్చాలంటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన మండల కాంగ్రెస్ పక్షాన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.ఈ దేశంలో 160 కోట్ల దేశ ప్రజలు స్వేచ్ఛ సమానత్వంతో జీవించుతున్నారు అంటే దానికి కారణం ఈ దేశ రాజ్యాంగం అలాగే మతలు-కులాలు, పేధ-ధనిక, శ్రామిక-పరిశ్రమల, వ్యవసాయ కూలీ- భూస్వామ్య వ్యవస్థ ఇలా అనేక వ్యవస్థలు కల భారతీయులు ఎవరి హక్కులు వారికి ఇచ్చే విధంగా, మనవ హక్కులు కాపాడే విధంగా ఎందరో మహానుభావులు దేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించారు. ఏమైనా సవరింపులు ఉంటే మార్చుకునే అవకాశం కూడా మన రాజ్యాంగం కల్పించిన ఈ కే.సి.ఆర్ అధికార మధం నెత్తికెక్కి ఈ దేశ రాజ్యాంగం మార్చాలని మాట్లాడటం మంచిది కాదు అని తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం మండలం కాంగ్రెస్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బండారు నరసింహారావు, కిసాన్ సెల్ అధ్యక్షులు తలప రెడ్డి నాగిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ కడియం శ్రీనివాసరావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, ఎస్సి సెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, మండల నాయకులు పిచ్చిరెడ్డి, పిల్లి బోసు, దేవరకొండ ఏడుకొండలు, నాగిరెడ్డి, షేక్ ఇస్మాయిల్, కంచర్ల వెంకట నరసయ్య, వార్డ్ నెంబర్ దేశ్ పోగు రోశయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.