పట్టుదలతో కష్టపడి చదివితే విజయం మీదే - ఎస్పీ సింధు శర్మ, డిఎస్పీ ప్రకాష్

Published: Tuesday June 28, 2022

జగిత్యాల, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో కష్టపడి చదివితే విజయం మీదే  అని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. సోమవారం రోజున  ఎస్. కె.ఎన్.ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే  ప్రీ-కోచింగ్, అవుట్ డోర్ కోచింగ్ ను జిల్లా అదనపు ఎస్పీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రీ-కోచింగ్ ను మీరందరూ సరైన విదంగా ఉపయోగించుకొని  ఉద్యోగం సాధిస్తారనే నమ్మకం మాకు ఉందని కాబట్టి మీరందరూ ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదవాలని సూచించారు. పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ గురించి మరియు ఎగ్జామ్ పేపర్ ను గురించి మరియు చదవాల్సిన బుక్స్ గురించి నిపుణులైన వారిచే కోచింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ 3 దశలో ఉంటుందని ఇందులో నిర్దిష్ట ప్రణాళికతో, సరైన అవగాహనతో ముందుకు వెళితేనే ఉద్యోగం సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రూపేష్ , డిఎస్పిలు ప్రకాష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వామనమూర్తి, నవీన్ , రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు కృష్ణ గౌడ్, వినోద్ రెడ్డి, మరియు డిస్టిక్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు