పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే నాయకులు ఎంపీ నామనిరుపేద కుటుంబాలకు నామ ముత్తయ్య మెమో

Published: Friday November 18, 2022
ఎర్రుపాలెం నవంబర్ 17 ప్రజా పాలన ప్రతినిధి ఎర్రిపాలెం మండలం ఎర్రుపాలెం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నాడు నామా ముత్తయ్య మొబైల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేల మంది నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి ఆటో డ్రైవర్లు, హమాలీలకు ఖాకీ చొక్కాలు ఎంపీ నామ అందించారు.ముఖ్యమంత్రి కేసీఆర్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వం లో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల కోసం కేంద్రం పై ఎంపీ నామ అలుపెరుగని పోరాటం.ఎర్రుపాలెం మండల కేంద్రంలో *200 మంది ఆటో డ్రైవర్లకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి ఖాకీ చొక్కాలు* పంపిణీపేదలకు ఎప్పుడు అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే నాయకులు పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు  రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు  జిల్లా నాయకులు,  వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ , ఎంపీపీ దేవరకొండ శిరీష, సొసైటీ చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు పంబి సాంబశివరావు  తదితరులు పేర్కొన్నారు గురువారం నాడు మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండల కేంద్రంలో టీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి సుమారు గా 200 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ నామ నాగేశ్వరరావు  అన్ని వర్గాల వారికి ఆత్మబందువు గా ఉంటున్నారని తెలిపారు ఎంపీ గా గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్  సహకారంతో పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని తెలిపారు మరోవైపు తమ తల్లిదండ్రులు నామ ముత్తయ్య - వరలక్ష్మి గార్ల పేరుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారన్నారు తమ ట్రస్ట్ నుండి ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్దిక సహకారం అందించి వారిని ఉన్నత స్థాయికి చేరేలా కృషి చేశారన్నారు పలు గ్రామాల్లో మంచి నీటి బోర్లు ఏర్పాటు తో పాటుగా హెల్త్ క్యాంపు లు సహా పలు సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు ఆటో డ్రైవర్లకు, హమాలీలకు అవసరమైన ఖాకీ చొక్కాలను ప్రత్యేకంగా తయారు చేపించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వేలాది మందికి అందజేయడం జరిగిందన్నారు లోక్ సభ లో పార్టీ ఫ్లోర్ లీడర్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ,  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అలానే విభజన బిల్లులో ఉన్న హామీల అమలు కోసం కేంద్రం పై పార్లమెంట్ లోపల ,బయట అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అలాంటి నాయకుడికి మనం అందరం కలిసి అండగా నిలవాలని కోరారు.
మీనవోలు సొసైటీ చైర్మన్ కుడుములు మధుసూదన్ రెడ్డి  టిఆర్ఎస్ సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, సర్పంచ్ మోగిలి అప్పారావు , సర్పంచ్ పురుషోత్త రాజు  సర్పంచ్ జంగా పుల్లారెడ్డి , సర్పంచ్ ఎర్రమల భాస్కర్ రెడ్డి , వైస్ ఎంపీపీ రామకోటయ్య ,  బాల రాఘవ రెడ్డి ,  ఎంపీటీసీ షేక్ మస్తాన్ వలి , ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు  ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్ బాబు ,   యూత్ అధ్యక్షులు కొండేపాటి సాంబశివరావు  ,టౌన్ పార్టీ అధ్యక్షులు చెన్నం రాము  భూక్య రాము ,  డైరెక్టర్ ఆవులు ముత్తయ్య  మండల కమిటీ సభ్యులు దేవరకొండ రవి ,  బోర్ర మురళీమోహన్ ,  ఎర్రమల కృష్ణారెడ్డి , బుర్ర నారాయణరావు వెంకటేశ్వర్లు , బీసీ సెల్ నాయకులు కత్తి నాగేశ్వరావు , నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు,  బోర్ర నరసింహారావు ,  కాశిపోయిన కాలేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.