పెండ్లిలకు ఆర్థిక సాయం అందించిన జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్

Published: Friday June 25, 2021
జిన్నారం మండలం శివ నగర్ గ్రామానికి చెందిన బ్యాతోల్ గోపాల్ కూతురు సుమ వివాహానికి, అదేవిధంగా వంశీ రాజ్ కూతురు పావని వివాహానికి జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఆయా శుభకార్యాలకు ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివనగర్ సర్పంచ్ రేఖ ఎంపిటిసి సంతోష, నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.