ఎమ్మెల్యే చోరవ తో స్వగ్రామం చేరిన తాల్లపల్లి శంకరయ్య

Published: Thursday September 22, 2022

జన్నారం, సెప్టెంబర్ 21, ప్రజాపాలన: మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన తాల్లపల్లి శంకరయ్య 51సం.లు  బ్రతుకు దేరువు కోసం ఇరాక్ దేశాలకు పోయి ఎనిమిది సం.లు నరకయాతన అనుభవించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ చొరవతో గల్ఫ్ జెఏసి ఉపాధ్యక్షుడు గంగుల మురళీధర్ రెడ్డి, ఇరాక్ లోని ఎర్బిల్ ఇండియన్ ఎంబసీ సహకారంతో స్వగ్రామం చేరుకున్నానాని అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇప్పాలపల్లి గ్రామానికి చెందిన తాల్లపల్లి శంకరయ్య 51 సం.రాలు, మాట్లాడుతూ  బ్రతుకు దేరువు కోసం ఎనిమిది యెాడ్ల క్రితం లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి మొర్రి గూడెంకు చెందిన  ఏజెంట్ కమెర రాజేశ్వరి ద్వారా ఇరాక్ లో మేస్త్రి పని కొరకు వెళ్ళాడు. కానీ ఏజెంట్ మోసం, అతనికి వీసా ఇచ్చిన ఇరాక్, వారు చేసిన మోసానికి  రెసిడెన్సీ పడక , ఉద్యోగం లేక తీవ్ర కష్టాలు పడ్డానాని అయన తెలిపారు. మరోసారి ఉద్యోగ ప్రయత్నం లో ఉన్న తాను అక్కడ ఉండడానికి, గడవడానికి, కొత్త రెసిడెన్సీకి తనకు జరిగిన మెాసాన్ని స్వగ్రామంలో వున్న భార్య లక్ష్మి తెలిపి, భార్య ద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తెప్పించుకుని ఇరాక్ లో ఏజెంటుకు కట్టానాని అయన వివరంచారు. ఈ ప్రయత్నంలో  కూడా ఏజెంటు మోసానికి నాలుగు యెాడ్లు కాలయాపన చేసాడని, తను పని చెయ్యలేదని అయన అవేదన వ్యక్త పరచారు. దీంతో తన కుటుంబం మీద వడ్డీతో కలిపి పది లక్షల వరకు అప్పు అయ్యిందని తెలిపారు. కష్టాల్లో వున్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గల్ఫ్ కార్మికులు, సన్నిహితులు ద్వారా తన భార్య లక్ష్మీ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ను సహయం కోరడం జరిగిందని అయన అన్నారు. ఎమ్మెల్యే ఉన్నత అధికారులతో సంప్రదించి శంకరయ్య స్వగ్రామానికి రావడానికి ఎర్పాటు చేశారని, తను మంచిర్యాల జిల్లా జన్నారం మండలం స్వాగ్రామమైన ఇప్పలపల్లికి మంగళవారం సాయంత్రం చేరుకుని తల్లిదండ్రులను, భార్య పిల్లలను, సన్నిహితులను, కలుసుకోవడం జరిగిందని అయన అన్నారు.