కరోనా సోకిన 91 ఏళ్ల వృద్ధుడికి అరుదైన శస్త్రచికిత్స

Published: Saturday May 29, 2021

- అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ వైద్య బృందం
అమీర్ పెట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి ) : ప్రమాదవశాత్తు ఇంట్లో క్రిందపడి కాలు, చేయి విరిగిన 91 సంవత్సరాల వృద్ధుడికి అవేర్ గ్లెనిగల్స్ వైద్యులు రెండు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఈ మేరకు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైద్యులు సత్యనారాయణ, సుధీర్ ప్రసాద్ లు  మాట్లాడుతూ... నగరానికి చెందిన రాధాకృష్ణ మూర్తి(91) ప్రమాదవశాత్తు జారిపడి ఎముకలు విరిగి తీవ్రమైన గాయాలతో బాధపడుతూ గత నెల 30న హాస్పిటల్ ను ఆశ్రయించారు. పలు పరీక్షలు భాగంగా కోవిడ్ పరీక్ష నిర్వహించగా అతనికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో డాక్టర్లు విరిగిన ఎముకలను అతికించడానికి శస్త్ర చికిత్స కంటే ముందు వారం రోజుల పాటు కరోనా ట్రీట్మెంట్ అందించామని తెలిపారు. అనంతరం కరోనా నుంచి కోలుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత రెండు సర్జరీలు పూర్తిచేసి  ఎముకలను అతికించామని తెలిపారు. రెండు వారాల పాటు అతని  ఆర్థోపెడిక్, పల్మనాలజీ, వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అతను పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత మంగళవారం డిశ్చార్జ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఒకరి సాయంతో నడవ గలుగుతున్నాడు అని అన్నారు. భవిష్యత్తులో ఎవరి సాయం లేకుండా ఒంటరిగా తన దినచర్యను తానే చేసుకోగలడని తెలిపారు.