ఏసీఆర్ భృంగి కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published: Wednesday September 28, 2022
వికారాబాద్ బ్యూరో 27 సెప్టెంబర్ ప్రజా పాలన : కెసిఆర్ భంగి కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ భృంగి విద్యాసంస్థల సెక్రటరీ ఏ. ప్రమీల చంద్రశేఖర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలనే పూజించే గొప్ప పండుగ బతుమ్మ అని, తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని చిన్న, పెద్ద అందరు సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగ అన్నారు. అనంతరం ఏసీఆర్ భృంగి యాజమాన్యం విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ఏ.చరణ్, అఖిల్, భృంగి యాజమాన్యాల డైరెక్టర్ శివప్రసాద్, రమాదేవి, సాహు శ్రీలత, శిరీష, విజయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు