రామారావుకు నివాళులర్పించిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల..

Published: Thursday January 05, 2023
తల్లాడ, జనవరి 4 (ప్రజాపాలన న్యూస్):

తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురజాల రామారావు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ జడ్పిటిసి దిరిశాల ప్రమీల బుధవారం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు ఉన్నారు.*