*నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా

Published: Monday October 03, 2022
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ విమర్శించారు ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో డివైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని, దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు, దేశంలో వివిధ ప్రభుత్వ శాఖలలో దాదాపు 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటికి ప్రభుత్వం ఇప్పటికీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయటం లేదని, కనీస ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెంటనే వీటికి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిసారి ప్రభుత్వం మాటలు చెబుతుంది కానీ ఆచరణలో ఒక్క అడుగు కూడా వేయడం లేదన్నారు, యువశక్తిని సక్రమంగా వినియోగించుకుంటే దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు, దేశంలో ప్రభుత్వాలు యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని తద్వారా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
*డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా పి జగన్ ఎన్నిక*
అనంతరం డివైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా నూతన కార్యదర్శిగా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన పి.జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలువేరు రాజు, జిల్లా అధ్యక్షులు జక్కిడి అనిల్ రెడ్డి, నాయకులు ఆలంపల్లి జంగయ్య, స్వామి, శివ శంకర్, లెనిన్, హఫీజ్, లింగస్వామి, దినేష్ విప్లవ్, ప్రభు, విజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.